కోపం ఎక్కువగా ఉంటోందా..? ఈ ఆహారపదార్దాలు తీసుకుంటే కోపం రాదు..!

-

చాలామందికి తరచూ కోపం వస్తూ ఉంటుంది. కోపం ఎక్కువగా ఉన్నవాళ్లు కోపాన్ని ఎక్కువగా చూపించడం వలన ఆగ్రహానికి గురవడం వలన ఆరోగ్యం పాడవుతుంది. కొందరు త్వరగా కోపానికి గురవుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ అది మంచిది కాదు. కోపం ఎక్కువ రావడం వలన ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక నిమిషం వలన సంబంధాలు దెబ్బతింటాయి. పైగా కోపం వలన ఆరోగ్యం కూడా పాడవుతుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రశాంతత ఉండదు. ఆనందంగా జీవించలేరు.

Anger
Anger

మీకు కూడా కోపం విపరీతంగా వస్తోందా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోండి. ఈ ఆహార పదార్థాలను కనుక తీసుకుంటే కోపాన్ని తగ్గించుకోవచ్చు. పసుపుని వంటల్లో చేర్చుకోవడం మంచిది. పసుపులో కార్క్యుమిన్ లో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అయితే శరీరంలోని డోపమైన్ వంటి హార్మోన్ లెవెల్స్ ని పెంచి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది పసుపు. కోపం తగ్గుతుంది. అలానే అరటి పండ్లు కూడా సహాయం చేస్తాయి. అరటి పండ్లను ఎక్కువ తీసుకుంటే కూడా కోపం తగ్గుతుంది.

మెగ్నీషియం పొటాషియం వంటి మూలకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. డోపమైన్ హార్మోని ఆక్టివ్ చేస్తుంది. కోపాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది అదేవి ధంగా బాదంని కూడా తీసుకోండి బాదం లో క్యాల్షియం ఎక్కువ ఉంటుంది నరాల కండరాల ప్రశాంతతకి ఇది సహాయపడుతుంది. ఇలా బాదం ద్వారా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అవిసె గింజలు కూడా కోపాన్ని కంట్రోల్ చేస్తాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉంటాయి మానసిక స్థితిని అవిసె గింజలు మెరుగుపరుస్తాయి. ఆందోళనని కూడా తగ్గిస్తాయి.

గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తాయి. మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది మానసిక స్థితిని ఆరోగ్యంగా మారుస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేస్తుంది. సన్ఫ్లవర్ సీడ్స్ ని కూడా తీసుకోవచ్చు. అలానే కివి కూడా కోపాన్ని తగ్గిస్తుంది ఆకుకూరలు తీసుకుని కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news