తెలుగు ఇండస్ట్రీలోకి ఎన్నో ఏళ్ల నుంచి ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు. అయితే వారిలో కొంతమంది ఇప్పుడు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉన్నారు మరి కొంతమంది కనుమరుగై పోయిన వారు ఉన్నారు. అలా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఫిదా సినిమా తో పరిచయమయ్యారు నటుడు సాయిచంద్. ఇందులో సాయి పల్లవి తండ్రిగా నటించిన ఎంతో అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఇప్పుడు తాజాగా విరాటపర్వం సినిమాలో కూడా సాయి పల్లవి తండ్రి గానే నటించి మంచి ప్రేక్షకుల ఆదరణ పొందారు.
గత కొద్ది రోజుల క్రితం ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిచంద్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశారు. సినిమాలో సాయి పల్లవి కి తండ్రిగా మాత్రమే నటించడానికి తను ఎక్కువగా ఇష్టపడతానని తెలియజేశారు. ముఖ్యంగా ఫిదా సినిమా తో వారిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడిందని నిజంగానే తను తన కూతురు గా అనిపించడం వలనే తనతో బాగా చేయగలుగుతున్ననని తెలియజేశారు. ఇక అంతే కాకుండా సాయి పల్లవి పుట్టినప్పుడు నేను సినిమాలు చేయడం మానేశాను.. మళ్లీ తను నటించిన ఫిదా సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చానని తెలియజేశారు. ఇవి రెండూ యాదృచ్ఛికంగా జరగడంతో తామిద్దరి మధ్య ఏదో కారణం లేకపోతే ఇలా జరగదు కదా అనిపిస్తూ ఉంటుంది అని తెలియజేశారు సాయి చంద్.ఇక సాయి పల్లవికి కాకుండా వేరొకరికి తండ్రి గా నటించాలంటే కాస్త ఆలోచిస్తానని తెలిపారు. నిజ జీవితంలో ఒక తండ్రి ఎమోషన్ ఎలా ఉంటుందనే విషయం తనకు తెలియదని.. ఎందుకంటే తనకు ఇంకా వివాహం కాలేదని.. అంతేకాకుండా తాను ఎవరినో ప్రేమించి ఆ ప్రేమ విఫలం కావడం వల్లనే తన వివాహం చేసుకోలేదని రూమర్స్ ఉన్నాయి వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. పెళ్లి చేసుకోవడం వెనుక బలమైన కారణం ఏమీ లేదని.. కాలం గడిచి పోయింది అని తెలియజేశారు.