‘తొక్క’లో బంగాళదుంపకు ఇంతుందా.. ఇన్నాళ్లు అసలొదిలేసి కొసరు పట్టుకున్నాంగా..!!

-

బంగాళాదుంపలు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటుంటారు. అయితే చాలామంది ఆలు అంటే చాలు నోరూరిపోతుంది. ఎవరైనా సరే బంగాళదుంపను తొక్కతీసే వండుతారు.. కానీ అలా చేయడం తప్పంటున్నారు నిపుణులు.. బంగాళదుంప తొక్కలోనే అసలైన పోషకాలు ఉన్నాయట.. ఈ విషయం తెలియన మనం అసలు వదిలేసి కొసరు పట్టుకున్నాం..

బంగాళాదుంప తొక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి తొక్కతీసి తినకుండా తొక్కతో పాటే వండుకోవాలట.

బంగాళాదుంప తొక్కలో ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి శరీరానికి అత్యవసరమైనవి. వీటిలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇవన్నీ మన శరీరాన్ని క్యాన్సర్ నుంచి కాపాడతాయి.

తొక్కలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, గ్లైకోఅల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి.

అందానికి కూడా బంగాళాదుంప తొక్కలు మేలు చేస్తాయి. వీటిలో యాంటీ బ్యాక్టిరియల్, ఫినాలిక్, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. తొక్కలను ముఖంపై మొటిమలు, మచ్చలున్న చోట రుద్దుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి సాధారణ బ్లీచింగ్‌లా పనిచేస్తాయి.

ఈ తొక్కల్లో ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, రాగి, జింక్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అత్యవసరమైనవి. ఇవి ఎముకల వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.

బంగాళాదుంప తొక్క నుంచి తీసిన రసంతో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు బలంగా పెరుగుతుంది. అలాగే వెంట్రుకలు మెరుస్తుంది. తెల్లజుట్టు కూడా తగ్గుతుందట…

బంగాళాదుంపలను తొక్కతో పాటూ తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం చాలా తగ్గుతుంది. దీనికి కారణం ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది.

తొక్కకు మట్టి ఉంటుందని అందరూ తీసేసి వండుతారు.. కొంచెం సేపు నీటిలో నానపెట్టి ఆపై క్లీన్‌ చేసుకుంటే..ఎంత మట్టి అయినా పూర్తిగా పోతుంది. తొక్కతో వండుకుంటేనే కూర రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది..! ఈసారి ఇలా ట్రే చేసి చూడండి. టైమ్‌ కూడా సేవ్‌ అవుతుంది.!!

Read more RELATED
Recommended to you

Latest news