బుధ‌వారం సాయంత్రం ఐదు గంట‌ల‌కు చంద్రబాబు చెప్పేది ఇదే?

-

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అమరావతి చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అమారవతిలోనే పూర్తి రాజధాని కాకుండా… మిగిలిన ప్రాంతాలకు కూడా ఆ హోదా, ఆ హక్కు, ఫలితంగా అభివృద్ధి కలిగించాలని నిర్ణయించారు. ఫైనల్ గా ముందుకువెళ్తున్నారు.. అది జరిగితీరుతుందనే చెప్పుకోవచ్చు! మరి ఈ పరిస్థితుల్లో బాబు పరిస్థితి ఏమిటి? చంద్రబాబు.. జగన్ కు విసిరిన 48గంటల డెడ్ లైన్ పూర్తవబోతోన్న తరుణంలో ఏమి చెప్పాలనుకుంటున్నారు?

chandrababu
chandrababu

అసెంబ్లీ ర‌ద్దు స‌వాల్ ‌ను జ‌గ‌న్‌ కు విసరడం.. దానికోసం 48 గంట‌ల డెడ్ ‌లైన్ ‌ను బాబు విధించడం తెలిసిందే. అప్ప‌టికీ జగన్ స్పందించ‌క‌పోతే తాను మ‌ళ్లీ మీడియా ముందుకొచ్చి ప్ర‌తి అంశంపై చ‌ర్చిస్తాన‌ని చెప్పుకొచ్చారు. నిజంగా బాబుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత ధైర్యం ఉందా? కాసేపు ఉందనుకుంటే… జగన్ ప్రమేయం లేకుండా, అసెంబ్లీ రద్దు టాపిక్ అవసరం లేకుండా… ఉన్న 20మందితో బాబు రాజినామాలు చేయించి ఎన్నికలకు వెళ్లొచ్చు… చిత్తశుద్ధి ఉంటేనే సుమా?

రాష్ట్రంలో 75 శాతం ప్రజలు మూడు రాజ‌ధానుల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారనేది చంద్రబాబు మాట. దానివెనకున్న లాజిక్ ఏమిటో బాబుకే తెలియాలి. కాసేపు అదే నిజం అనుకుంటే… బాబు గుండెలపై చేయివేసుకుని హాయిగా 20 మంది స‌భ్యుల‌తో రాజీనామా చేయించెయ్యొచ్చు! ఆ 20 మంది మళ్లీ గెలిస్తే… బాబు హీరో అయిపోతారు!! జగన్ కు 151 వచ్చాయన్న బాద చాలావరకూ తగ్గిపోతుంది కూడా!

కాబట్టి… చంద్రబాబు చెబుతున్న మాట నిజమే అయితే.. ఇంతకు మించిన సువర్ణావకాశం మరొకటి లేదు! బాబు ఈస్ బ్యాక్ అయినట్లే! అదే బాబు నమ్మితే… బుదవారం సాయంత్రం మైకులముందుకో, జూం లోకో వచ్చే బాబు… “జగన్ తోక ముడిచారు, బాబు ముడవడు” అని చెబుతూ తన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేస్తానని ప్రకటిస్తారు.. తాను చెబుతున్నట్లుగా 75% ప్రజలను నమ్ముకుని ఎన్నికలకు వెళ్తారు?

అలా కానిపక్షంలో… ఇవన్నీ మడత మాటలే అని అనుకోవాలంటే… చంద్రబాబు చెప్పబోయే స్పీచ్ ఇలా ఉండొచ్చు! త‌న స‌వాల్ ‌కు అధికార పార్టీ తోక‌ముడిచింద‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేస్తారు. తాను కాడి దించేసి… అమరావతి జేఏసీకి తమ పార్టీ పూర్తి మద్దతు అని ప్రకటించి.. ఒకటి రెండు ఎగస్ట్రా డైలాగులు చెప్పి, కళ్లు తుడుచుకుని కాం అయిపోతారు!! వీటిలో బాబు బుదవారం సాయంత్రం… ఏమి చెప్పబోతున్నారు! సంచలనాలకు తెరతీస్తారా లేక రెగ్యులర్ రాజకీయ ప్రసంగాలకే పరిమితమయ్యి… ఆఖరికి ఆ 29 గ్రామలా రైతులను కూడా మోసం చేస్తారా అన్నేది వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Latest news