దాడికి పాల్పడిన ఐసిస్.. ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారమేనా?

-

అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో కార్తే పర్వాన్ గురుద్వారాపై శనివారం దాడులు నిర్వహించినట్లు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతకర వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు సంస్థ వెల్లడించింది. ఈ మేరకు అఫ్గాన్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఐసిస్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ సభ్యులు టెలికాం గ్రూపులో పోస్టు చేశారు. హిందూ, సిక్కు మతాలకు మద్దతిస్తున్న వర్గాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ సెక్యూరిటీ గార్డును కాల్చి తన వద్ద ఉన్న మిషిన్ గన్, గ్రనేడ్లతో గురుద్వారాలో ఉన్నవారిపై దాడి చేసినట్లు వెల్లడించారు.

ఐసిస్ దాడి

కాగా, వరుస బాంబు పేలుళ్లతో కాబుల్‌లోని గురుద్వారా ప్రాంతం దద్దరిల్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఓ తాలిబన్ భద్రతా సిబ్బంది, ఓ అఫ్గాన్ సిక్కు జాతీయుడు ఉన్నారు. ఉదయం ఆరు గంటల సమయంలో ఉగ్రవాదులు గురుద్వారాలో చొరబడ్డారు. బాంబు పేలుళ్లు నిర్వహించి.. అరగంట తర్వాత మరో బాంబు పేలుడు దాడికి పాల్పడ్డారని స్థానికులు పేర్కొన్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న తాలిబన్ ప్రభుత్వ భద్రతా దళాలు రంగంలోకి దిగి.. ఉగ్రవాదులపై దాడి చేశాయి. కొన్ని గంటలపాటు జరిగిన దాడిలో ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version