అది మండే అగ్నిగోళం..50 ఏళ్లగా ఆగని మంటలు.. కారణం తెలియక శాస్త్రవేత్తల తంటాలు..

-

ఈ భూమిపై ఎన్నో వింతలు.. మరెన్నో అద్భుతాలు.. అన్నింటి కలయికే జీవరాశి.. కొన్నిటికి కారణాలు ఉంటాయి.. అంతుచిక్కని రహస్యాలు ఎన్నో.. ! వాటిని సైన్స్‌కు కనిపెట్టలేకపోయింది. అలాంటి వింతల్లో ఒకటి ఈ గ్యాస్ క్రేటర్.. దీన్ని గేట్స్ ఆఫ్ హెల్ అని కూడా అంటారు.. తుర్క్ మెనిస్తాన్ దేశంలోని ఎడారిలో దర్వాజా అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సమీపంలో ఈ గ్యాస్ క్రేటర్. దీన్ని చాలా మంది నరకానికి ముఖద్వారాం అని చెప్పుకుంటారు. ఏంటీ ఈ ప్లేస్‌ ప్రత్యేకత..నిజంగా అంత డేంజరా..?

ఏంటి ప్రత్యేకత?

దర్వాజా గ్రామ సమీపంలో ఒక పెద్ద గొయ్యి ఉంది. ఆ గొయ్యిలోనుంచి మంటలు నిరంతరం వస్తూనే ఉంటాయి. అధికారిక నివేదికల ప్రకారం.. ఆ బిలం నుంచి 50 ఏళ్లుగా మంటలు మండుతూనే ఉన్నాయి. ఈ బిలం ఎలా ఏర్పడింది అనే విషయమై కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇది ఎలా ఏర్పడిందో ఎంత కాలం నుంచి మండుతూనే ఉందో ఎవరికి కచ్చితంగా తెలియదు. మనుషులు గుర్తించినప్పటి నుంచి మాత్రం ఇది మండుతూనే ఉంది. ఈ బిలం 226 అడుగుల వెడల్పుతో, 98 అడుగుల లోతుతో ఉంటుంది. ఈ ప్లేస్‌పై పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
ఈ ప్రదేశం ఎంతోమంది భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు పరిశోధనల గమ్యస్థానంగా మారింది. ఈ బిలం ఎప్పుడు ఏర్పడిందో చెప్పే నివేదికలు లేవు, కానీ 1960లో జరిగి ఉండొచ్చని కొంతమంది భావిస్తున్నారు. సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంజనీర్లు దీన్ని సృష్టించారని కూడా టాక్.. కొంతమంది మాత్రం ఇది సహజంగానే భూమిలోకి కుంగిపోయిందని అంటారు. ఈ బిలం సహజ వాయువు క్షేత్రం. అంటే దాన్నుంచి సహజవాయువు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది.
ఆ కారణంగానే మంటలు ఆగకుండా మండుతూనే ఉన్నాయి.. అయితే తుర్క్ మెనిస్తాన్ ప్రభుత్వం చుట్టుపక్కల గ్రామాల పర్యావరణం, ప్రజారోగ్యంపై ఈ మంటలు ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయని.. ఈ మంటలను ఎలా అయినా ఆర్పివేయాలని ప్రణాళికలు వేశారు. కాకపోతే ఇప్పటికీ ఆర్పి వేసే పనులు మాత్రం చేయలేదు. ప్రస్తుతం ఆ బిలం మండుతూనే ఉంది. దీన్ని చూడ్డానికి వేలాదిగా పర్యాటకులు వస్తుండడంతో ఆ దేశానికి ఆదాయం వస్తుంది. కొంతమంది ఈ బిలంలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేశారు. 2013లో గ్రీకు దేశానికి చెందిన జార్జ్ కౌర్వనిస్ అనే వ్యక్తి బిలం దిగువకు వెళ్లాడు. ఆ సాహసయాత్ర నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌లో టెలికాస్ట్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news