మునుగోడు పోటీ నుండి టిఆర్ఎస్ తప్పుకోవడం మంచిది – బండి సంజయ్

-

సీఎం కేసీఆర్ కి సిగ్గు ఉంటే మునుగోడు ఉప ఎన్నికల పోటీ నుండి తప్పుకోవాలని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నుండి సంజయ్. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బిజెపి ప్రయత్నించిందంటూ టిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని.. డబ్బు దొరికిందని ప్రచారం చేస్తున్నారని సంజయ్ అన్నారు. కొనుగోలుకు కుట్ర జరిగిందని చెబుతూ ఏసీబీ కోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు.

డబ్బు దొరికింది నిజమే అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు ఎక్కడుందని ప్రశ్నించారు. దీనికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనని యాదాద్రి వెళ్లకుండా అడ్డుకోవాలని సీఎం కార్యాలయం నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయని అన్నారు.బ్ ఎట్టి పరిస్థితుల్లో యాదాద్రి నరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేసి నిజాయితీని నిరూపించుకుంటామని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే ఈ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. అన్ని సర్వేలు బిజెపికి అనుకూలంగా వస్తున్నాయని.. అందుకే దొంగ దారిని వెతుక్కున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version