BREAKING : టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు..పుష్ప షూటింగ్ రద్దు !

-

BREAKING : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కు ఊహించని షాక్‌ తగిలింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే.. సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని సమాచరం.

ఇక అటు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో ఈడీ సోదాలు చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దాదాపు 700 కోట్ల రూపాయల వరకు వివిధ రూపాల్లో నగదు సమకూర్చుకుని జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలోనే… మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో ఈడీ సోదాలు చేస్తోంది. దీంతో పుష్ప షూటింగ్ రద్దు అయింది. అయితే.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్‌ కాంబోలో ఇప్పుడు పుష్ప 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version