కర్ణాటకలో మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రము మొత్తం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతోంది. బీజేపీకి మద్దతుగా సినీ రంగం నుండు నటులు సైతం వచ్చి ప్రసారం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండగా మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కర్ణాటకలో బెంగుళూరు మరియు మైసూరు నగరాలలో పెద్ద పెద్ద ఫైనాన్సియర్ ల ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులకు పాల్పడ్డాడు. అయితే ఆశ్చర్యకరంగా ఈ దాడులలో రూ. 15 కోట్ల డబ్బు మరియు రూ. 5 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగింది.
కర్ణాటకలో ఐటీ దాడుల్లో డబ్బు & బంగారం స్వాధీనం…
-