వైవాహిక జీవితంలో భార్య భర్తలు ఇద్దరూ కలిసిమెలసి కష్టసుఖాలను పంచుకుని ముందుకు వెళితేనే వారి వైవాహిక జీవితం బాగుంటుంది. చిన్న చిన్న వాటికి కూడా సర్దుకోకపోతే ఇబ్బందులు తప్పవు. నిజానికి వైవాహిక జీవితంలో ఇద్దరూ కూడా అహంకారాన్ని వదిలేసి సర్దుకుంటూ వెళ్లిపోవాలి. అలానే ఇద్దరు కూడా ప్రతి విషయాన్ని పంచుకుని జాగ్రత్తగా సమస్యను పరిష్కరించుకోవాలి.
అప్పుడు చక్కగా జీవితం ముందుకు వెళుతుంది. నిజానికి అర్థం చేసుకునే గుణం లేకపోతే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. అయితే ఈ రాశి భార్యలు కనుక జీవితంలోకి వచ్చారంటే భర్తలకు కష్టాలు తప్పవని పండితులు అంటున్నారు. అయితే మరి ఆ రాశులు వాళ్ల గురించి చూద్దాం.
మేష రాశి:
మేష రాశిలో పుట్టిన వారు ఎక్కువగా శంకించేవారై ఉంటారు భర్తపై వాళ్లకి అసలు నమ్మకం ఉండదు. అలానే వీళ్ళు భావోద్వేగులై ఉంటారు. ఈ రాశి వారు కనక భార్య కింద వచ్చారు అంటే ఆ భర్తకి కష్టమే.
వృషభ రాశి:
ఈ రాశిలో పుట్టిన వారిని నమ్మొచ్చు కానీ ఇతరులపై వీళ్ళకి నమ్మకం ఉండదు. ఎప్పుడూ కూడా ఇతరులను అనుమానిస్తూ ఉంటారు భర్తని కూడా ఎప్పుడూ వీళ్లు అనుమానిస్తూ ఉంటారు. ఇలా అనుమానం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ రాశి వారు కనక భార్య కింద వచ్చారంటే భర్తకు ఇబ్బంది తప్పదు.
ధనస్సు రాశి:
ఈ రాశి వారి భాగస్వామికి కాస్త స్పేస్ ఇవ్వడం వీళ్ళకి అస్సలు నచ్చదు. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.
మిధున రాశి:
ఎక్కువగా వీళ్ళు ఆనందంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. పైగా వీళ్ళ మాటలతో ఎవరినైనా ఆకర్షించగలరు భాగస్వామిని మోసం చేయటం లో వీళ్ళు ఫస్ట్.
మీన రాశి:
మీనరాశి స్త్రీలతో కూడా ఆ కష్టం. వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అయితే రిలేషన్ షిప్ లో వీళ్ళు ఒకే చోట ఉండాలి అంటే వీళ్ళకి భయం అందుకే మరొకరితో కమిట్ అయిపోవాలని చూస్తారు. ఇలాంటి భార్యలు వచ్చినా కూడా సమస్యే.