పవన్ కళ్యాణ్ ’ హరిహర వీరమల్లు‘ నుంచి శ్రీలంక బ్యూటీ అవుట్… ఇదే కారణం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న సినిమా ’హరిహర వీర మల్లు‘ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం, సూర్యమూవీస్ సంస్థ నిర్మిస్తోంది. గతంలో ఈ సంస్థ తీసిన ఖుషి మూవీ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

అయితే ఈ మూవీలో ఓ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ భామ, శ్రీలంక బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెస్ ను ఎంపిక చేశారు. ఈ మధ్య సుకేష్ చంద్రశేఖర్ వ్యవహారంలో ఈడీ జాక్వలెన్ కు కూడా నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన జాక్వెలిన్ ను ఇటీవల అధికారులు పట్టుకున్నారు. దేశం విడిచివెళ్లవద్దని ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. అందుకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి ఈ బ్యూటీని తప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అయితే ఈవ్యవహారంపై డైరెక్టర్ క్రిష్ స్పందించారు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతోనే జాక్వలెన్ మూవీ నుంచి తప్పుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ పాత్ర కోసం నర్గీస్ ఫక్రిని తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు జాక్వలిన్ను ఈడీ కేసుల్లో చిక్కుకోవడంతో ఈ ప్రస్తావన వచ్చిందంటూ.. క్రిష్ తెలిపాడు. పవన్ కళ్యాన్ నటిస్తున్న ఈ సినిమాలో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రోషనార పాత్రంలో నర్గీస్ ఫక్రి కనిపించనుంది.