కేంద్రం, బీజేపీ దొంగాట ఆడుతున్నాయి: మంత్రి జగదీశ్‌రెడ్డి

-

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, రైతు పథకాలు ప్రధాని మోదీని కలవరపెడుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో మోదీ అండ్‌ గ్యాంగ్‌ సీఎం కేసీఆర్‌ను నిలువరింపజేసే కుట్ర చేస్తున్నది రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. రైతుబంధు సమితి నల్లగొండ జిల్లా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

దేశంలో ఎక్కడా అమలు కాని సంక్షేమ పథకాలతో పాటు ప్రధానంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు అమలు చేసే 24 గంటల కరెంట్‌, రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ మోదీ సర్కార్‌ను కలవర పెడుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో మోదీ అండ్‌ కో సీఎం కేసీఆర్‌ను నిలువరించి ఈ పథకాలు ఆపివేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. 27 ఏండ్లుగా గుజరాత్‌లో, 22 ఏండ్లుగా మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఎందుకు 24 గంటల కరెంట్‌ ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news