బైరెడ్డికి ఆ ఛాన్స్ ఇస్తారా?

-

ఏపీ రాజకీయాల్లో ఫుల్ క్రేజ్ ఉన్న యువనేతల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా ఒకరు…తక్కువ కాలంలోనే రాజకీయాల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. వైసీపీలో రాకముందు వరకు బైరెడ్డి గురించి పెద్దగా తెలియదనే చెప్పాలి..గతంలో సిద్ధార్థ్…తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వెనుక తిరిగేవారు. ఆయన ద్వారానే కాస్త రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. బైరెడ్డి రాజశేఖర్…రాయలసీమ పరిరక్షణ సమితి నడిపేటప్పుడు సిద్ధార్థ్ అండగా ఉంటూ వచ్చారు.

కానీ రాజశేఖర్ తర్వాత సమితిని క్లోజ్ చేసి…కాంగ్రెస్ లో చేరారు..తర్వాత వరుసగా పార్టీలు మారుతూ చివరికి బీజేపీలో ఉన్నారు. అయితే సిద్ధార్థ్..వైసీపీలోకి వచ్చి..ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు..తన మాస్ స్పీచ్ లతో యువతని ఆకట్టుకున్నారు. అలాగే 2019 ఎన్నికల్లో నందికొట్కూరులో వైసీపీ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే నందికొట్కూరు సమన్వయకర్తగా దూకుడుగా రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో జగన్…సిధార్థ్ కు ఏపీ స్పొర్ట్స్ అథారిటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు.

ఇక తాజాగా పార్టీలో కీలక పదవి కూడా ఇచ్చారు…వైసీపీ యువజన విభాగానికి అధ్యక్షుడుగా నియమించారు. అంటే బైరెడ్డికి పార్టీలో మంచి ప్రాధాన్యత ఇస్తూనే వస్తున్నారు. అయితే ఇలా పార్టీలో కీలకంగా ఉంటున్న బైరెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు కూడా ఇస్తే బాగుంటుందని వైసీపీ యువ కార్యకర్తలు కోరుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఫాలోయింగ్ తెచ్చుకున్న బైరెడ్డిని ఎన్నికల బరిలో దించితే విజయం ఈజీగా వస్తుందని అంటున్నారు.

అయితే బైరెడ్డి సొంత జిల్లా కర్నూలులో వైసీపీ ఫుల్ గా ఉంది…14 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లు ఖాళీ లేవు. అలాంటప్పుడు యువ నేత బైరెడ్డికి సీటు దక్కడం అనేది జరిగే పని కాదని కొందరు విశ్లేషకులు అంటున్నారు…కానీ జగన్ కొందరు ఎమ్మెల్యేలని మార్చే ఆలోచన చేస్తున్నారని, అప్పుడు ఏమన్నా బైరెడ్డికి ఛాన్స్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. కానీ ఫుల్ పోటీలో బైరెడ్డికి సీటు దొరకడం డౌటే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news