రోడ్లపై సభలు-ర్యాలీలకు నో..బాబు-పవన్-లోకేష్‌లకు చెక్.!

-

ఇటీవల వరుసగా చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి పలువురు కార్యకర్తలు మరణించిన విషయం తెలిసిందే. కందుకూరు రోడ్ షో..తొక్కిసలాట జరిగి 8 మంది టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. తాజాగా గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు. అయితే ఇదంతా చంద్రబాబు ప్రచారం పిచ్చి వల్లే జరిగిందని వైసీపీ ఆరోపించింది.

ఇలా వరుస ఘటనలు జరగడం వెనుక వైసీపీ కుట్ర ఉందని, దీన్ని సాకుగా చూపించే చంద్రబాబుని జనాల్లోకి వెళ్లకుండా చేయడమే వైసీపీ లక్ష్యమని టీడీపీ శ్రేణులు విమర్శించాయి. ఇక టీడీపీ శ్రేణులు చెప్పినట్లుగానే తాజాగా ఏపీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా..ఇకపై రోడ్లపై సభలు, ర్యాలీలని నిషేదిస్తున్నట్లు రాష్ట్రం హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టుకోవాలని సూచించింది. ఈ నియమాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపై, అలాగే మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని తెలిపింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఖచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వచ్చని మినహాయింపు ఇచ్చింది. ఇక ఇలా రూల్ పెట్టడంతో ఇకపై చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో త్వరలోనే నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. అటు పవన్ బస్సు యాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ నిర్ణయం వల్ల..ఇప్పుడు వారికి చెక్ పెట్టినట్లు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే నేడు జగన్ రాజమండ్రిలో భారీ సభలో పాల్గొనున్నారు. దానికి ముందు రోడ్ షో నిర్వహించనున్నారు. మొత్తానికి జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలని జనంలోకి వెళ్లకుండా చెక్ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news