నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవాలని ఇటు జగన్, అటు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంకోసారి అధికారంలోకి వస్తే చాలు..30 ఏళ్ల పాటు అధికారం దక్కించుకోవచ్చని జగన్ చూస్తున్నారు. ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే టీడీపీ ఉనికికే ప్రమాదమని కాబట్టి ఈ సారి ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని బాబు కష్టపడుతున్నారు. అవసరమైతే పొత్తు దిశగా కూడా ముందుకెళుతున్నారు. ఎవరు కలిసొచ్చిన..విడిగా వచ్చిన గెలుపు మాదే అనే ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు.
జగన్ కూడా అంతే ధీమాగా ఉన్నారు..అందుకే 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్తితులని చూస్తే..175 పక్కన పెడితే..100 సీట్లపైనే గెలుచుకుని అధికారంలోకి రావాలనేది జగన్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు తమకు అధికారంలోకి రావడానికి పరిస్తితులు అనుకూలంగా ఉన్నాయని జగన్ భావిస్తున్నారు. తాము అందిస్తున్న పథకాలు గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. 98 శాతం పైనే హామీలు అమలు చేశామని, పథకాలు అందిన ప్రతి ఒక్కరూ తమకు అండగా ఉంటారని అనుకుంటున్నారు.
పైగా ఇటీవల సర్వేల్లో ప్రభుత్వ వ్యతిరేక పెద్ద స్థాయిలో లేదని తేలిందట..దానికంటే ప్రభుత్వ అనుకూల ఓట్లు ఎక్కువ ఉన్నాయని సర్వేలో తేలినట్లు సమాచారం. దాని బట్టి చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచేయవచ్చని జగన్ భావిస్తున్నారు. అందుకే పొత్తులో కలిసొచ్చినా సరే తమని ఓడించలేరని వైసీపీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. జగన్‌కు చెక్ పెట్టడం సాధ్యం కాదని అంటున్నారు.
అయితే గెలుపుపై వైసీపీ కాన్ఫిడెంట్‌గా ఉందని చెప్పవచ్చు..కానీ రియాలిటీలో అది నిజమవుతుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. ఇప్పుడు అధికార బలంతో వైసీపీనే స్ట్రాంగ్ గా ఉండవచ్చు. అలా అని టీడీపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అదే సమయంలో జనసేనతో కలిస్తే టీడీపీ బలం మరింత రెట్టింపు అవుతుంది. చూడాలి జగన్ కాన్ఫిడెన్స్ నిజమవుతుందో లేదో.