బాబుకు మళ్ళీ షాక్..చిత్తూరులో జగన్ డామినేషన్..!

-

ఉమ్మడి చిత్తూరు జిల్లా పేరుకు టి‌డి‌పి అధినేత చంద్రబాబు సొంత జిల్లా..కానీ ఇక్కడ పూర్తిగా వైసీపీ డామినేషన్ ఉంది. ఇక్కడ జగన్ ని అభిమానించే వాళ్ళు ఎక్కువ. గత రెండు ఎన్నికల్లో కూడా అదే రుజువైంది. 2014లో గాని, 2019లో గాని చిత్తూరులో వైసీపీ ఆధిక్యం…ఇక ఇప్పటికీ అక్కడ వైసీపీ హవా ఉందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 14 స్థానాలు ఉన్న జిల్లాలో 2014లో వైసీపీ 8, టి‌డి‌పి 6 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఇక 2019 ఎన్నికల్లో కేవలం ఒకటే సీటు అది కూడా కుప్పంలో చంద్రబాబు గెలిచారు..మిగిలిన 13 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. అంటే వైసీపీ హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక తాజాగా వచ్చిన సర్వేల్లో కూడా చిత్తూరులో వైసీపీ ఆధిక్యమే ఉందని స్పష్టం చేసింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 8 సీట్లు గెలుస్తుందని, టి‌డి‌పి 4 సీట్లు మాత్రమే గెలుస్తుందని సర్వేలో తేలింది. 2 సీట్లలో టఫ్ ఫైట్ ఉందని చెప్పింది.

వైసీపీ గెలిచే సీట్లు వచ్చి..పుంగనూరు, తంబళ్ళపల్లె, చంద్రగిరి, పూతలపట్టు, సత్యవేడు, చిత్తూరు, తిరుపతి, జీడీ నెల్లూరు. టీడీపీ గెలిచే సీట్లు వచ్చి..కుప్పం, పలమనేరు, మదనపల్లె, నగరి…టఫ్ ఫైట్ వచ్చి పీలేరు, శ్రీకాళహస్తిల్లో ఉంది.

అయితే తిరుపతి, చిత్తూరు, పూతలపట్టు, తంబళ్ళపల్లె, జీడీ నెల్లూరు స్థానాల్లో టి‌డి‌పికి బలమైన నాయకత్వం లేదు..అందుకే ఆ స్థానాల్లో టి‌డి‌పికి ఓటమి తప్పడం లేదు. తిరుపతి, చిత్తూరు స్థానాలపై టి‌డి‌పి ఆశలు పెట్టుకుంది..కానీ ఆ రెండు చోట్ల టి‌డి‌పికి నాయకత్వం లేదు. దీని వల్ల వైసీపీకి బెనిఫిట్ జరుగుతుంది. ఒకవేళ బలమైన నాయకులని పెడితే సీన్ ఏమైనా మారుతుందేమో చూడాలి. ఏదేమైనా చంద్రబాబు సొంత జిల్లాలో జగన్ డామినేషన్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news