గుంటూరు : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లు, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభించారు సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే రైతులకు పంపిణీ చేసే ట్రాక్టర్ ను స్వయంగా నడిపారు ఏపీ సీఎం జగన్. దీనికి సంభందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీతో పాటు5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి జమచేశారు.టిడిపి అధినేత చంద్రబాబు హయాంలో ట్రాక్టర్ల పంపిణీలో అవినీతి జరిగిందని ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అగ్రహించారు. ఇప్పుడు రైతులు ఏ ట్రాక్టర్ కావాలో వారే నిర్ణయించుకుంటారన్నారు. 175.60కోట్ల సబ్సిడీని రైతులకు సబ్సిడీ వారి ఎకౌంట్లలో వేస్తున్నామని తెలిపారు ఏపీ సీఎం జగన్.
ట్రాక్టర్ నడిపిన సీఎం వైఎస్ జగన్. pic.twitter.com/mW7Pv2vfiJ
— Sakshi TV (@SakshiHDTV) June 7, 2022