కమ్మ సామాజిక వర్గం మరోసారి జగన్ దృష్టిలో పడిందా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత చాలా మంది చేసిన వ్యాఖ్య, కమ్మ సామాజిక వర్గం ఇబ్బంది పడుతుంది… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారిని టార్గెట్ చేయడం ఖాయమని చాలా మంది అభిప్రాయపడ్డారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం అండగా ఉంది. చాలా మంది కమ్మ సామాజిక వర్గ పారిశ్రామిక వేత్తలు ఆ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఉంటారు.

ఆర్ధిక సహకారం కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా అందుతూ ఉంటుంది అనే పేరు కూడా ఉంది. ఈ నేపధ్యంలో టీడీపీని దెబ్బ కొట్టడానికి జగన్ వారిని టార్గెట్ చేసారని, అందుకే అమరావతిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ని శాశించే కమ్మ సామాజిక వర్గాన్ని రాజధాని మార్పు ద్వారా జగన్ దెబ్బ కొట్టారు అంటున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు జగన్ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీనితో జగన్ వారిని ఇబ్బంది పెట్టడానికి గాను తన సొంత సామాజిక వర్గానికి గ్రామాల్లో పెద్ద పీట వేసే అవకాశం ఉందని అంటున్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని ఇప్పటికే ఆర్ధికంగా జగన్ దెబ్బ కొట్టారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

ఇప్పుడు వారి ప్రభావాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ద్వారా గ్రామాల్లో మరింతగా తగ్గించాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు కీలక మంత్రులకు ఈ మేరకు ఆదేశాలు జారి చేసారు. టీడీపీ కి మద్దతుగా ఉండి మనను ఇబ్బంది పెట్టే వాళ్ళను అంత తేలికగా వదిలి పెట్టవద్దని జగన్ సూచనలు చేసినట్టు సమాచారం. మంత్రులు కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news