వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ-ప్రతిపక్ష టిడిపిల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయమని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో అంటే వార్ వన్ సైడ్ గా నడిచిందని చెప్పవచ్చు. కానీ ఈ సారి ఆ పరిస్తితి కనిపించడం లేదు. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అయితే గెలుపు ఎవరిది అనేది స్పష్టమైన తీర్పు బయటకు రావడం లేదు.
ఇదే సమయంలో జనసేనతోనే ఆ రెండు పార్టీల భవిష్యత్ ఆధారపడి ఉందని తెలుస్తోంది. అంటే పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయం బట్టే జగన్ గెలవడమా? లేక చంద్రబాబు గెలవడమా? అనేది జరుగుతుందని తెలుస్తోంది. అంటే పవన్ గాని టిడిపితో పొత్తు పెట్టుకుంటే జగన్ గెలవడం కష్టమవుతుందని తెలుస్తోంది. అదే సమయంలో పొత్తు లేకపోతే మాత్రం జగన్ కు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా అదే తేలింది.
అంటే జనసేనకు సింగిల్ గా గెలిచే బలం మాత్రం లేదు..ఆ పార్టీ ఏదో 10 లోపు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది..కానీ 50 పైనే సీట్లలో గెలుపోటములని ప్రభావితం చేసే శక్తి జనసేనకు ఉంది. ఆ విషయం గత ఎన్నికల్లోనే రుజువైంది. జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి నష్టం, వైసీపీకి లాభం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ టిడిపితో పొత్తు పెట్టుకోకపోతే మళ్ళీ ఓట్లు చీలి వైసీపీకి బెనిఫిట్ అవుతుంది. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అది పవన్ కు కూడా క్లారిటీ ఉంది.
అయితే ఆయన వైసీపీని ఎలాగైనా గద్దె దించాలనే చూస్తున్నారు..కాబట్టి ఖచ్చితంగా టిడిపి తో కలిసే అవకాశాలు ఉన్నాయి అప్పుడు వైసీపీకి డ్యామేజ్ జరగడం ఖాయమని చెప్పవచ్చు. అలా జరగకపోతే జగన్ కే బెనిఫిట్.