అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలి విదేశీ అధికారిక పర్యటన ఖరారు అయింది. మే 22 నుంచి దావోస్ లో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొననున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి… పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా సిఎం జగన్ పర్యటన కొనసాగనుంది.

ఇక సిఎం హోదాలో.. జగన్ మోహన్ రెడ్డి.. విదేశీ పర్యటనకు వెళ్ళడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇది ఇలా ఉండగా..ఇవాళ ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వైఎస్సార్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే…ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.