ఏపీ మందు బాబులకు శుభవార్త.. కొత్త బార్ పాలసీ ప్రకటించిన జగన్ సర్కార్

-

ఏలో బార్ లైసెన్సులను మరో రెండు నెలల పాటు పొడిగించిన ప్రభుత్వం… జూలై 1 తేదీ నుంచి ఆగస్టు 31 తేదీ వరకూ లైసెన్సుల గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ నెలాఖరుతో ముగుస్తున్న ప్రస్తుత బార్ లైసెన్సుల గడువు పొడగించిన సర్కార్.. లైసెన్సుల పొడిగించిన కాలానికి నిర్దేశిత ఫీజులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. జూన్ 27 తేదీలో నిర్దేశిత లైసెన్సు ఫీజులు చెల్లించాల్సిందిగా సూచనలు చేసింది. ఏపీలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి కొత్త బార్ పాలసీ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం… సెప్టెంబరు 1 తేదీ నుంచి కొత్తబార్ పాలసీ అమల్లోకి వస్తుందని తెలిపింది.

మూడేళ్ల కాలపరిమితితో కొత్త బార్ లైసెన్సులు జారీ చేసింది. కొత్త బార్ పాలసీలో లైసెన్సు ఫీజుతో పాటునాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచింది. మద్య నియంత్రణ విధానంలో రాష్ట్రంలో ఉన్న 840 బార్లకు మాత్రమే లైసెన్సుల పునరుద్ధరణ చేస్తామన్న ప్రభుత్వం… ప్రస్తుతం ఉన్న బార్లు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా కొత్త పట్టణ ప్రాంతాలకూ విస్తరించేలా లైసెన్సుల హేతుబద్దీకరణ చేయనుంది.

పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ కార్పోరేషన్లు, నగరపంచాయితీల్లో ఎన్ని బార్లు ఉండాలో అబ్కారీశాఖ కమిషనర్ నిర్ణయిస్తారని పేర్కోన్న ప్రభుత్వం… లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి మున్సిపల్ కార్పోరేషన్ లో 10 కిలోమీటర్లు, మున్సిపాలిటీలో 3 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా బార్ పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు రూ. 5 లక్షలుగా నిర్ధారణ చేసిన సర్కారు.. 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో దరఖాస్తు ఫీజు రూ. 7.50 లక్షలు పేర్కొంది. 5 లక్షల జనాభా దాటిన ప్రాంతాల్లో రూ. 10 లక్షల దరఖాస్తు ఫీజుగా నిర్దారించింది ప్రభుత్వం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news