ఉద్యోగులకు షాక్‌..జీతాలపై జగన్ సర్కార్‌ కీలక నిర్నయం

-

ఏపీ ఉద్యోగులకు షాకిచ్చేందుకు జగన్ సర్కార్‌ సిద్ధమౌవుతోంది. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల చెల్లింపుల పై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. జీతాల చెల్లింపు ప్రాసెసింగ్ కు ఇవాళే డెడ్ లైన్ కావడంతో.. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే.. వేగం పెంచిన ఆర్ధిక శాఖ శరవేగంగా కొత్త పి ఆర్ సి బిల్లులు ఏర్పాటు చేస్తోంది. నిన్న, మొన్న ఉద్యోగుల జీతాల బిల్లులు అప్లోడ్ చేశారు ట్రెజరీ ఉద్యోగులు.

శని వారం, ఆదివారం అర్థరాత్రి వరకు బిల్లులు అప్లోడ్ చేశారు ఉద్యోగులు. ట్రెజరీల్లో సుమారు 2 లక్షల బిల్లులు కొత్త పీఓర్సీ ప్రకారం సిద్ధం చేశారు ఉద్యోగులు. పే అండ్ అకౌంట్స్ లో 50 వేల బిల్లులు ప్రాసెస్ చేశారు అధికారులు. ఆర్థిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు పర్యవేక్షణలో బిల్లులు సిద్ధం చేశారు. ఈరోజు నుండి పెన్షనర్ల బిల్లులు రెడి చేయనున్నారు ఉద్యోగులు. ఇది ఇలా ఉండగా.. ఏపీ ఉద్యోగులు.. సర్కార్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news