మున్సిపల్ కార్మికలకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కాగా…ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్య నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జీతం, అలనెన్సు రూపంలో రూ. 18 వేలు ఇస్తున్నామని… అలనెన్సును మరో రూ. 3 వేలు పెంచాలని కార్మికులు కోరుతున్నారన్నారు.
వాటితో పాటు ఇంకా ఇరవై సమస్యలపై చర్చించామని… 80 శాతం మేర జీతాలను ప్రభుత్వం పెంచింది.. అయినా ఇంకా పెంచాలని కోరడం సరికాదని వెల్లడించారు. అనంతరం ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ…. మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించామని… గత ప్రభుత్వాలు వారిని గాలికి వదిలేశాయన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు గణనీయంగా పెంచామని.. హెల్త్ కార్డులు. మరణానంతరం వచ్చే బెనిఫిట్సుతో పాటు ఇరవై సమస్యలను మా ముందు ఉంచారని పేర్కొన్నారు. ఇంకా సమస్యలుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించాం… ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలన్నీ చర్చించుకుని తమ నిర్ణయం చెప్తామన్నారన్నారు.