BREAKING : ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. కాసేపటి క్రితమే “జగనన్న విదేశీ విద్యా దీవెన” నిధులు విడుదల అయ్యాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జగనన్న మొదటి విడత విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేశారు. తొలి విడతలో 213 మంది విద్యార్థులకు రూ.19.95 కోట్ల సాయం చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. ప్రపంచ వేదికపై మన విద్యార్థులు ఆంధ్రా జెండా ఎగరవేయాలన్నారు. మన పిల్లలు ప్రపంచస్థాయిలో రాణించాలని కోరారు సీఎం జగన్. కాగా.. సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు, సమగ్ర కార్యాచరణకు నిన్న సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా అన్నిరకాల హాస్టళ్లలో నాడు – నేడు కింద పనులు చేయాలని.. స్కూళ్ల నిర్వహణా నిధిలానే హాస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు చేశారు. హాస్టళ్లలో తప్పనిసరిగా వైద్యుల సందర్శన, హాస్టళ్ల నిర్వహణా ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలన్న సీఎం.. ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.