ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పాలనను అందిస్తున్న జగన్ ఎన్నో పధకాలను నిరుపేదల శ్రేయస్సు కోసం తీసుకువచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా విద్యాదీవెన పధకం కింద ప్రతి సంవత్సరం కొంత డబ్బును చదువుకునే విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తున్నారు. ఇక తాజాగా 2022 – 2023 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యాదీవెన పధకం కింద అమౌంట్ ను సీఎం జగన్ ఈ నెల 24 వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనలో ట్రాన్స్ఫర్ చేయనున్నారు.
ఆ తర్వాత అక్కడే జరగనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ వార్త తెలిసిన విద్యార్థులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఇప్పటికే అమౌంట్ వచ్చే విద్యార్థులకు సంబంధించిన లిస్ట్ రెడీ అవ్వగా, ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత డిపార్ట్మెంట్ కు వెళ్లి పరిష్కరించుకోవాల్సిందిగా వాలంటీర్లు చెబుతున్నారు.