జగన్‌కు ‘కమ్మ’ని దెబ్బ..కవర్ చేయలేకపోతున్నారుగా.!

-

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయాలు మారిపోయాయి..పాలసీ పరంగా కాకుండా పర్సనల్ టార్గెట్స్ తో రాజకీయం నడుస్తోంది. ఇలాంటి రాజకీయం టీడీపీ అధికారంలో ఉండగానే జరిగింది..కానీ వైసీపీ వచ్చాక మరింత పెరిగిందని చెప్పొచ్చు. ఇంకా పర్సనల్ అంటే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. కేసులు, జైలుకు కూడా పంపేస్తున్నారు.

ముఖ్యంగా వైసీపీ వచ్చాక కమ్మ వర్గంపై కక్ష సాధిస్తుందనే అంశం బాగా హైలైట్ అయింది. కమ్మ వర్గాన్ని యాంటీగా చేస్తూ వైసీపీ ఓ సరికొత్త రాజకీయ క్రీడ మొదలుపెట్టిందనే చెప్పొచ్చు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ సైతం పలుమార్లు స్పందించిన విషయం తెలిసిందే. అలా ఒక వర్గాన్ని విలన్ గా చేసి, టార్గెట్ చేయడం సరికాదని మండిపడిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే వైసీపీ..తమ శత్రువుగా కమ్మ వర్గాన్ని చూస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే గత ఎన్నికల్లో జగన్ గెలుపుకు కమ్మ వర్గం కూడా సపోర్ట్ చేసింది. దాదాపు 30 శాతంపైనే కమ్మ వర్గం వైసీపీ కోసం పనిచేసింది.

అలాగే వైసీపీలో కమ్మ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. ఇంకా కమ్మ నేతలు ఉన్నారు. అయినా సరే టీడీపీకి కమ్మ పార్టీ ముద్ర వేసి..కమ్మ వర్గం టార్గెట్ గానే రాజకీయం నడిపింది. ఈ క్రమంలో వైసీపీకి సపోర్ట్ చేసిన కమ్మ వర్గం సైతం ఇప్పుడు యాంటీ అవుతుంది. విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకు ఎన్టీఆర్ పేరు తీసి, వైఎస్సార్ పేరు పెట్టడంపై విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలోనే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు..ఎన్టీఆర్ పేరు తీయడం సరికాదని, కమ్మ వర్గంపై కక్ష సాధిస్తున్నట్లు కనిపిస్తున్నారని, ఎన్నికల్లో 35 శాతం కమ్మ వర్గం జగన్ కోసం పనిచేశారని, క్యాబినెట్‌లో కమ్మ వర్గానికి ప్రాధాన్యత లేదని, పక్క రాష్ట్రంలోనే కమ్మ వర్గానికి మంచి ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చారు.

ఇక నాగేశ్వరరావు వ్యాఖ్యలకు ఆయన తనయుడు వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి మాటలని వైసీపీ శ్రేణులు పట్టించుకోవద్దని, జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు జగన్‌ని ఎవరు పొగడలేదని, అలాంటప్పుడు యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీస్తే ఎందుకు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, అవి ఆయన వ్యక్తిగతమని అన్నారు. ఇక జగన్ చెబితే పోటీ చేస్తానని లేదంటే పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు.

అటు నాగేశ్వరరావు వ్యాఖ్యలకు కొడాలి నాని సైతం కౌంటర్ ఇచ్చారు..టీడీపీ హయాంలో ఎస్టీ, మైనారిటీ వర్గాలకు క్యాబినెట్‌లో చోటు లేదని, వెనుకబడిన వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎన్టీఆర్‌ని కమ్మ వర్గానికి పరిమితం చేయొద్దని అన్నారు. అయితే నాగేశ్వరావు మాట్లాడిన మాటలు వైసీపీలో కలకలం రేపాయి. అసలే వైసీపీకి కమ్మ వర్గం దూరమవుతుంది..ఈ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తాయి. కృష్ణప్రసాద్, కొడాలి కవర్ చేసిన సరే కమ్మ వర్గంలో వైసీపీకి వ్యతిరేకత పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news