మోడీ.. భూములు లేవు.. పెన్షన్ లేదు.. ఉద్యోగం లేకుండా చేశాడు : జగ్గారెడ్డి

-

ఆర్మీ రిక్రూట్మెంట్ బీజేపీ అధికారం లోకి వచ్చే వరకు సక్రమంగా జరిగాయని, ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగే సమయంలో అగ్ని పథ్‌ తెచ్చి యువతను నిరాశ పరిచారంటూ మండిపడ్డారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేండ్లు మాత్రమే ఉద్యోగం ఇస్తున్నాడు మోడీ అని.. అర్మీలో ఒక్క సారి సెలెక్ట్ అయ్యాక..రిటైర్మెంట్ అయ్యే వరకు ఉద్యోగం ఉండేది.. ఆర్మీ నుండి బయటకు వస్తే 5 ఎకరాల భూమి.. ఉద్యోగాలు వచ్చేవి అంటూ ఆయన గుర్తు చేశారు. కానీ.. మోడీ… భూములు లేవు.. పెన్షన్ లేదు..ఉద్యోగం లేకుండా చేశాడంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని పథ్‌ ఆందోళనలు బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి మొదలైందని, అగ్నిపథ్‌ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

రాహుల్ గాంధీ కూడా అగ్ని పత్ రద్దు చేస్తాం అని మాట ఇచ్చారని, సికింద్రాబాద్ లో యువత ఉద్యోగాలు రావని ఆవేశంలో మోడీ కి వ్యతిరేకంగా ఆందోళన చేశారన్నారు. సికింద్రాబాద్ ఆందోళన కారులకు ఇప్పటికీ బెయిల్ కూడా రాలేదని, దీనికి బాధ్యులు మోడీ నే కదా..? అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులపై ఉన్న కేసులు ఉపసంహరించుకో వాలని, జైల్లో ఉన్న వారికి బెయిల్ వచ్చేలా చేయాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version