డెమోక్రసీని, ఎన్నో వ్యవస్థలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే : జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ అధిష్టానం మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తెలంగాణలోని ఆయా నియోజకవర్గాల్లో అజాద్‌ కి గౌరవ్‌ పేరిట పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు రెండో రోజు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశ ప్రజల కోసం అనేక వసతులు,ఉపాధి,నీళ్లు, కరెంట్, రోడ్లు ,విద్య, వైద్యంలో అనేకం తీసుకొచ్చిందన్నారు. నిన్న మొన్న పుట్టిన వాళ్ళు కాంగ్రెస్ ఏంచేసిందని మాట్లాడుతారని, కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు, బండి సంజయ్ 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని అంటుంటారని ఆయన మండిపడ్డారు. ఇంత పెద్ద దేశంలో డెమోక్రసీ ని, ఎన్నో వ్యవస్థలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే కదా అని ఆయన ప్రశ్నించారు.

Jagga Reddy: Latest News, Videos and Photos of Jagga Reddy | The Hans India  - Page 1

ఈ రోజు చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూపెట్టి సోనియా, రాహుల్ గాంధీ ల పై ఈడీ కేసులు పెడుతుంది బీజేపీ ప్రభుత్వం.ఉద్యమ సమయంలో మోడీ,అమిత్ షా, కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు,బండి సంజయ్ ఎవరు పుట్టలేదు కదా.. రాష్ట్రం కావాలి అంటే సోనియమ్మ రాష్ట్రం ఇచ్చింది.. ఇచ్చిన రాష్ట్రంలో మీరే హీరోలు అయ్యారు కదా..! ఇంత చేసిన ఇంకా కాంగ్రెస్ ఎం చేసిందని ఊరికే అంటుంటారు.. బండి సంజయ్ కి రాజకీయాల్లో తూ తెలీదు తా తెలీదు… మోడీ పుట్టింది 1952 లో..స్వతంత్ర0 వచ్చింది 1947 లో అంటే స్వతంత్ర వచ్చాక మోడీ పుట్టి ఆ ఫలాలను అనుభవిస్తున్నాడు అని ఆయన విమర్శించారు.