ఐ-టీడీపీ అనేది లోకేష్ నడుపుతున్న గ్రూప్ : మంత్రి మేరుగ నాగార్జున

-

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో కాల్‌ అంటూ వైరల్‌ అయిన సంఘటనపై తాజాగా అనంతపురం ఎస్పీ ఫకీరప్ప క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. మేము వదిలేసే ప్రసక్తే లేదని, యూకే నుంచి కూడా పట్టుకొస్తామన్నారు. ఐ-టీడీపీ అనేది లోకేష్ నడుపుతున్న గ్రూప్ అని, వందకు వంద శాతం ఇది టీడీపీ మార్ఫింగ్ చేసిన వీడియో అని అన్నారు. అంతేకాకుండా.. ఇది తెలుగుదేశం కార్యాలయం నుంచి చేసిన దుచ్చర్యే. జగన్‌ను ఎదుర్కోలేక ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక పక్క వాళ్లే చేసి మళ్లీ వాళ్లే రౌండ్ టేబుల్ పెట్టిస్తున్నారు. ప్రతిపక్షంగా విఫలమై అసెంబ్లీ నుంచి పారిపోయిన పిరికి పంద చంద్రబాబు. భవిష్యత్తులో అన్నీ బయటకు వస్తాయి… మేమూ ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ఇలాంటి పనులు చేయలేదు. లోకేష్ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తోంది. దుష్ట చతుష్టయం మా ఎంపీ గోరంట్ల మాధవ్ ని అప్రదిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేశారు.

Merugu Nagarjuna : టీడీపీ రథ చక్రాలు ఊడిపోయాయి - NTV Telugu

ఫిర్యాదు టీడీపీ కానీ, బాధితులు కానీ చేయలేదు. మా నాయకుడ్ని అప్రదిష్టపాలు చేస్తున్నారని మాధవ్ అనుచరులు ఫిర్యాదు చేశారు. ఐ టీడీపీ గ్రూప్ లో యూకే నుంచి వచ్చిందని ఎస్పీ చెప్పారు. గురివింద సామెతల వాళ్ళది వాళ్ళు చూసుకోవటం లేదు. ఏదో ఒకరకంగా అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. మా బీసీ ఎంపీని రోడ్డు మీదకు తీసుకువస్తారా..?. చంద్రబాబు నీ హయాంలో ఎన్ని అకృత్యాలు చేశావ్…? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను చంద్రబాబు ఎంత అవమానించావ్. ఈ రోజు జగన్ వాళ్ళని అక్కున చేర్చుకుంటే ఇలాంటి కుయుక్తులు. మహిళలకు 50 శాతం వాటా ఇచ్చి ముందుకు వెళ్తుంటే దాన్ని తట్టుకోలేక ఇలాంటి ఆరోపణలు. నీ కొడుకు ఏమీ చేశాడు… భాష రాని ఆయన కూడా ఈ రోజు మాట్లాడతాడు. మా బీసీ ఎంపీ అనేగా…ఈ విధంగా కుట్రలు చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news