జమ్మూకాశ్మీర్ లో రెండు ఎన్ కౌంటర్లు…. ఒక ఉగ్రవాది హతం, మరికొందరి కోసం గాలింపు

-

జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి ఒకే రోజు రెండు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు జరిగాయి. బండిపోరాలోని సాలిందర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఒక ఏకే రైఫిల్ తో పాటు మూడు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు. హతమైన ఉగ్రవాదిని కొత్తగా ఏర్పడుతున్న ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన వాడిగా గుర్తించారు. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం అన్వేషణ కొనసాగుతోందని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.

మరోవైపు కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. జిల్లాలోని బిజ్ బెహరా ప్రాంతంలోని మర్హమా వద్ద భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే పాక్- ఇండియా బోర్డర్ సాంబా ప్రాంతంలో ఆర్మీ, సీఆర్ఫీఎఫ్, బీఎస్ఎఫ్ ఉమ్మడిగా కూంబింగ్ చేస్తున్నాయి. ఇటీవల నలుగురు ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే తెలిసి భద్రతా బలగాలు గాలింపు చేపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news