జమ్మూ కాశ్మీర్ వరసగా ఎన్ కౌంటర్ల చోటు చేసుకుంటున్నాయి. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా అనంత్ నాగ్ శ్రీగుప్వారా లో జరిగిన ఎన్ కౌంటర్ లో కీలక ఉగ్రవాాది హతమార్చాయి భద్రతా బలగాలు. ఇతను నిషేధిత ఐఎస్ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదిగా ఉన్నాడు. మరణించిన ఉగ్రవాదిని ఫహీం భట్ గా గుర్తించారు. కాగా ఇతను గతం కొంత కాలంగా ఇస్లామిక్ స్టేట్ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద సంస్థలో కీలకంగా పనిచేస్తున్నాడు.
గతంలో జరిగిన కొన్ని ఉగ్రవాద దాడుల్లో ఫహీం భట్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో ఓ ఏఎస్ఐని చంపిన ఘటనలో కీలక నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బిజ్‌బెహరాలో పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఏఎస్ఐ మొహమ్మద్ అష్రఫ్ హత్య కేసులో నిందితుడిగా ఫహీం ఉన్నాడు. నిన్న జరిగిన రెండు చోట్ల జరిగిన ఎన్ కౌంటర్లలో అన్సార్ గజ్వత్ యుఎల్ హింద్ (AuGH), ఇద్దరు లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదులు రెండు వేర్వేరు కాల్పుల్లో హతమయ్యారు.