మహారాష్ట్ర, మణిపూర్ రాష్ట్రాల్లో భూకంపాలు…

-

దేశంలో వరస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న తమిళనాడు వెల్లూర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. తాజా మహారాష్ట్ర, మిజోరాం రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించాయి. మహారాష్ట్రా నాసిక్ లో ఆదివారం ఉదయం భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. రిక్టర్ స్కెల్ పై 3.9 తీవ్రతో భూకంపం సంభవించింది. నాసిక్ నుంచి పశ్చిమాన 88 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉంది.

ఇదిలా ఉంటే ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కూడా భూకంపం సంభవించింది. మణిపూర్‌లోని ఇంఫాల్‌కు పశ్చిమ-వాయువ్యంగా ఆదివారం రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ తెలిపింది. ఇటీవల తరుచుగా ఇండియాలో భూకంపాలు సంభవిస్తున్నాయి. మిజోరాం, మణిపూర్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఇటీవల కాలంలో భూకంపాలు సంభవించాయి. అయితే భూకంపాల తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. కేవలం స్వల్పంగా ప్రకంపనాలు వస్తుండటంతో.. పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం కలగడం లేదు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news