నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న జానారెడ్డి ఆసక్తికర సవాల్ విసిరారు. టీఆర్ఎస్, బీజేపీ, నేను నామినేషన్ వేసి ప్రచారం చేయకుండా ప్రజల అభీష్టానికి వదిలేద్దామని, కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చో, బీజేపీ వాళ్ళ భవన్ లో కూర్చోవాలి, నేను గాంధీ భవన్ లో కూర్చుంటా ఎవరు గెలుస్తారో చూద్దామా ? అంటూ సవాల్ చేశారు. నా సవాల్ స్వీకరిస్తారా..అని ప్రశ్నించారు. గిరిజనుల కు జానారెడ్డి కాదు… మీ జానా నాయక్ నీ, మీ రిజర్వేషన్ కోసం కొట్లాడతా, నెల్లి కల్లు కోసం కొట్లాడతా, పూర్తి అయ్యే వరకు పని చేస్తానని అన్నారు.
నేను అధికారంలో ఉన్నా…లేకున్నా… నా వారసులు పని పూర్తి చేస్తారని, వారసులు అంటే.. నా కొడుకో… బిడ్డో కాదని, ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త నా వారసులేనని అన్నారు. మీ వయసులో నేనుంటే… ఈ ప్రభుత్వాన్ని ప్రజా ఉద్యమాల ద్వారా గజ గజ లాడించే వాణ్ణన్న ఆయన కానీ వయసు రీత్యా మిమ్మల్ని ప్రజాస్వామ్య వాదులుగా తీర్చి దిద్దుతానని అన్నారు. మీలో చైతన్యం నింపుతూ ఉంటానని అన్నారు. మీ పక్షాన కొట్లాడే శక్తిని ఇవ్వండి, ఏ ప్రభుత్వం ఉన్నా… కొట్లాడి గిరిజనుల పక్షాన నిలబడతానని అన్నారు.