జనసేన ట్విటర్ ఖాతాల సస్పెన్షన్.. ఎవరి పని..?

-

జనసేన పార్టీకి సంబంధించిన ట్విటర్ ఖాతాలు 400 వరకు సస్పెండ్ అయ్యాయన్న వార్త కలకలం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. జనసేనకు సంబంధించి ఇన్ని ఖాతాలు సస్పెండ్ అవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. అయితే ఇలా ఖాతాలు ఎందుకు సస్పెండ్ అయ్యాయి. ఇందుకు కారణం ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది.

నకిలీ ఖాతాలను.. దుష్ప్రచారాన్ని అరికట్టడానికి ట్విటర్ కొన్ని ఖాతాలను సస్పెండ్ చేస్తుంది. మరి జనసేన వంటి పార్టీకి చెందిన ఖాతాలు ఎందుకు సస్పెండ్ అయ్యాయో తెలియాల్సి ఉంది.దీనిపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్విటర్‌లో తీవ్రంగా స్పందించారు. జనసేనకు మద్దతిస్తున్న 400 ట్విటర్‌ ఖాతాలను ఎందుకు సస్పెండ్‌ చేశారో అర్థం కావడం లేదు.

నిస్సహాయులైన ప్రజల తరఫున నిలబడుతున్నందుకే ఇలా చేస్తున్నారా? మేం ఎలా అర్థం చేసుకోవాలి అంటూ ఆయన ట్విట్టర్ ద్వానే ప్రశ్నించారు. అయితే కొన్నిరోజులుగా జనసేన ఆధ్వర్యంలో యురేనియం వ్యతిరేక ప్రచారం జరిగింది. ఇది కొంతవరకూ కేంద్రానికి వ్యతిరేకం. అందువల్లే కేంద్రం ఫిర్యాదు మేరకు ఇవి సస్పెండ్ అయి ఉండవచ్చని కొందరి అనుమానిస్తున్నారు.

ఇంకొందరు ఇది వైసీపీ లేదా, టీఆర్ ఎస్ వంటి పార్టీల పని కూడా కావచ్చని అనుమానిస్తున్నారు. అసలు సస్పెండ్ చేసిన ట్విటర్ మాత్రం మాకు ఫిర్యాదు అందింది మేం పరిశీలిస్తున్నాం అని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. జనసేన సోషల్ మీడియా ప్రచారానిక ఆయువుపట్టు అయిన శతఘ్ని అనే ట్విటర్ ఖాతా కూడా సస్పెండ్ కావడం జనసేనకు చాలా ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news