జవాద్ తుఫాన్.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ…

-

ఏపీకి ముప్పు ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫాన్ ’జవాద్‘ గా మారింది. ఏపీ తీరానికి గంటకు 32 కిలోమీటర్ల వేగంతో దూసుకోస్తుంది. ప్రస్తుతం విశాఖ తీరానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో.. ఒడిశా గోపాల్ పూర్ తీరానికి 530 కిలోమీటర్ల దూరంలో… పారాదీప్ కు 650 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీక్రుతం అయింది. రేపు ఉదయం ఒడిశా పూరీ తీరంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చిరిస్తోంది. తుఫాను తీరానికి దగ్గరగా వచ్చే కొద్ది గాలుల తీవ్రత పెరుగుతోంది.

ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు భాారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలుపుతోంది. ముఖ్యంగా దక్షిణ ఒడిశా.. ఉత్తరాంధ్ర తుఫాను ప్రభావానికి ఎక్కువగా లోనవనున్నాయి. ఏపీలో కాకినాడ నుంచి మొదలుపెడితే శ్రీకాకుళం దాకా వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రభావిత జిల్లాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆయా జిల్లాల కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version