Breaking : ముగిసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఈసీ విచారణ

-

టీడీపీ సీనియ‌ర్ నేత‌, తాడిపత్రి మునిసిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి శుక్ర‌వారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కార్యాల‌యానికి వ‌చ్చారు. త‌న కుమారుడు జేసీ అశ్మిత్ రెడ్డితో క‌లిసి వ‌చ్చిన ఆయ‌న ఈడీ అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. వాహ‌నాల అక్ర‌మ రిజిస్ట్రేష‌న్లు చేయించార‌న్న కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారుల ముందు విచార‌ణ‌కు వ‌చ్చిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి… ఈడీ అధికారుల తీరుపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈడీ నోటీసుల మేర‌కు శుక్ర‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని ఈడీ కార్యాల‌యానికి వ‌చ్చిన ప్ర‌భాక‌ర్ రెడ్డి విచార‌ణ‌కు హాజర‌య్యారు. దాదాపుగా 5 గంట‌ల పాటు విచార‌ణ సాగ‌గా… ఈడీ కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌భాక‌ర్ రెడ్డి అక్క‌డే మీడియాతో మాట్లాడారు.

ED JC Prabhakar Reddy : ఈడీ ముందు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి..

ఈ సంద‌ర్భంగా ఈడీ అధికారులు గొప్ప వాళ్ల‌న్న జేసీ… ఈడీ అధికారులు చిన్న‌వాళ్లేమీ కాద‌న్నారు. ఈడీ అధికారుల గురించి ఎలా అంటే అలా మాట్లాడ‌రాద‌ని కూడా ఆయ‌న కితాబిచ్చారు. త‌న ప‌ట్ల ఈడీ అధికారులు చాల గౌర‌వంగా వ్య‌వ‌హ‌రించార‌న్నారు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఈడీ అధికారుల గురించి బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారం అంతా త‌ప్పేన‌న్నారు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఈడీ లాంటి ద‌ర్యాప్తు సంస్థ వ‌ద్ద మ‌న‌ల్ని మ‌నం నిరూపించుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. త‌న‌పై న‌మోదైన కేసులో ఈడీ అధికారుల వ‌ద్ద ఇప్ప‌టికే అన్ని ఆధారాలు ఉన్నాయ‌న్న జేసీ… వాటిలో త‌న త‌ప్పేం లేద‌ని తాను నిరూపించుకుంటాన‌ని.. ఈ విష‌యంలో త‌న‌కు న‌మ్మకం ఉంద‌ని కూడా వ్యాఖ్యానించారు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news