జూన్ 23 నుంచి జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షలు..అడ్మిట్ కార్డులు..

-

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షలు ఈ నెల 23 నుంచి 29 వరకూ దేశవ్యాప్తంగా 501 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ జూన్ 14న (మంగళవారం) తెలియజేసింది.ఈ పరీక్షలకు సంభందించిన అడ్మిట్ కార్డులను కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. అంతకంటే ముందు ఎవరెవరికి ఏయే సిటీల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారనే విషయాన్ని తెలుపుతూ అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inలో ఇంటిమేషన్‌ స్లిప్‌ ను ఎన్టీఏ విడుదల చేసింది..

ఈ వెబ్ సైట్ లో పరీక్ష రాస్తున్న సెంటర్ మాత్రమే ఉంటుంది.పరీక్ష కేంద్రం ఎక్కడ అనేది అడ్మిట్ కార్డుల్లో తెల్పుతామని, అభ్యర్ధులు ఈ తేడాను గమనించవల్సిందిగా సూచించింది. ఒక వేళ వెబ్‌సైట్‌ నుంచి స్లిప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే 01140759000 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయవల్సిందిగా పేర్కొంది.

ఈ పరీక్షలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో అడ్మిట్‌ కార్డు ఇంకా జారీచేయకుండా కేవలం ఇంటిమేషన్‌ స్లిప్‌ మాత్రమే విడుదల చేయడంతో విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. కనీసం పది రోజుల ముందునుంచైనా అడ్మిట్‌ కార్డులు జారీ చేయకుండా చివరి వరకు టైం వెస్టు చెయ్యడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news