జీవితా రాజశేఖర్‌ కు బీజేపీ ఎంపీ టికెట్.. అక్కడి నుంచే పోటీ !

-

జీవిత- రాజశేఖర్.. ఈ పేర్లను విడదీసి చూడలేం.. విడదీసి చదవలేం.. తలంబ్రాలు సినిమాతో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత క్రమంగా ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికి ఒకరుగా జీవించారు. తెలుగు సినిమా జంటల్లో ముచ్చటైన జంట ఇది.

జీవితా-రాజశేఖర్‌ల దాంపత్య జీవితం ఒక సినిమా అయితే, ఆ సినిమాకు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, మాటలు అన్నీ జీవితానే. ఇది ఇలా ఉండగా.. జీవిత రాజశేఖర్‌ దంపతులు ప్రస్తుతం బీజేపీ పార్టీ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో జీవితకు ఎంపీ టికెట్‌ ఇచ్చేందుకు బీజేపీ రంగం చేసుకుందట. అన్ని ఓకే అయితే.. ఆమెకు టికెట్‌ ఇచ్చి.. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి బరిలోకి దింపనుందట బీజేపీ. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ప్రస్తుతం బీబీ పాటీల్‌ అక్కడ ఎంపీగా కొనసాగుతున్నారు. 2014, 19 ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ నుంచే గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news