డీఎంహెచ్ఓ కార్యాల‌యంలో కాంట్రాక్టు పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాల‌యంలో (డీఎంహెచ్ఓ) నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) ప్రొగ్రాం ద్వారా కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెసుకో వచ్చు.

మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాల‌యం లో (డీఎంహెచ్ఓ) నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) ప్రొగ్రాం ద్వారా మెడిక‌ల్ ఆఫీస‌ర్ తదితర విభాగం లో 13 పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తుకు మే 9, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తి లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోచ్చు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. మెడికల్ ఆఫీసర్లు 06, సైకాలజిస్ట్ 01, డీఈఐసీ మేనేజ‌ర్‌ 01, స్టాఫ్ న‌ర్స్‌ 01, ల్యాబ్ టెక్నీషియ‌న్‌ 01, ఫార్మ‌సిస్ట్ 02, సోష‌ల్ వ‌ర్క‌ర్‌ 01.

అర్హతల వివరాల లోకి వెళితే.. ఇంట‌ర్మీడియ‌ట్, సంబ‌ధిత కోర్సుల్లో డిప్లొమా, జీఎన్ఎం, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌, టీఎస్ మెడిక‌ల్ కౌన్సిల్‌ లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి. నోటిఫికేష‌న్‌, అప్లికేష‌న్ వివ‌రాలు తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్https://khammam.telangana.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.