ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహార్‌, జార్ఖండ్‌కు చెందిన ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ స్పోర్ట్స్‌ కోటా పరిధి లో ఈ పోస్టులని భర్తీ చేసాయనున్నారు. అయితే ఇందులో మొత్తం నాలుగు ఖాళీలని భర్తీ చేయనున్నారు. అయితే వీటిలో ట్యాక్స్‌ అసిస్టెంట్‌, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టులు ఉన్నాయి.

ఇక అర్హతల వివరాల లోకి వెళితే.. ట్యాక్స్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అప్లై చేసుకోవాలని అనుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయస్సు వచ్చేసి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్‌/ సెకండరీ స్కూల్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు వచ్చేసి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తుకు ఆఖరి తేదీ 28-01-2022 తేదీగా నియమించారు. కనుక ఈలోగా అప్లై చేసుకోవాల్సి వుంది. అభ్యర్థులను వయసు, ఐదేళ్ల క్రీడా నైపుణ్యాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. దరఖాస్తులను కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌, అడ్మిన్‌, టీపీఎస్‌, సెంట్రల్‌ రెవన్యూ బిల్డింగ్‌, పట్నా, బిహార్‌ 80001 అడ్రస్‌కు పంపించాలి. https://office.incometaxindia.gov.in/patna/Pages/default.aspx లో పూర్తి వివరాలని చూసి అప్లై చేసుకోచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news