బీటెక్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. ఇండియన్‌ ఆర్మీలో ఖాళీలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బీటెక్‌ చేసిన వారికి ఇండియన్‌ ఆర్మీ మంచి అవకాశం ఇస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఇండియన్‌ ఆర్మీ లో ఉద్యోగం పొందాలి అంటే అర్హులైన అవివాహిత పురుష, మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి షార్ట్ సర్వీస్ శిక్షణ కోసం తీసుకుంటారు.

jobs
jobs

 

మరణించిన రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా అవకాశాన్ని ఇస్తున్నారు. తమిళనాడు లోని, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA )లో అక్టోబర్ 2022లో కోర్సు ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. SSC(టెక్) – 175, SSCW(టెక్) – 14, విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ – 02, (SSC(W) టెక్ – 01, SSC(W) (నాన్ టెక్) (UPSC కానిది) – 01.

వయస్సు విషయానికి వస్తే.. SSC (టెక్), SSCW(టెక్) పోస్టులకి అక్టోబర్ 1, 2022 నాటికి 20 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. మరణించిన రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులు వారికి అయితే 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.

ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చూస్తే.. ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. అధికారిక వెబ్ సైట్ ఆధారంగా అర్హులు అప్లై చేసుకోచ్చు. అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ ఏప్రిల్ 6. కనుక ఈ లోగ అప్లై చేసుకోవడం మంచిది. పూర్తి వివరాలను http://www.joinindianarmy.nic.in/ లో చూడచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news