TELANGANA : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్..49వేల ఉద్యోగాల‌కు రంగం సిద్ధం..!

-

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఆర్థిక శాఖ ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కాకుండా ప్రత్యక్ష నియామకాల భర్తీకి మొత్తం 49 వేల పోస్ట్ లు ఉన్నట్టు ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఫైలును సిద్ధం చేసి మంత్రివర్గ ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం అందుతోంది.

KCR-TRS

ఇక ఈ ఉద్యోగాలు టిఎస్పిఎస్సి, పోలీసు నియామక, వైద్య మరియు పంచాయతీ నియామక బోర్డుల‌ పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ పలుమార్లు సమావేశాలు నిర్వహించడం కూడా జరిగిందని తెలుస్తోంది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల కూడా పై ఆర్థిక శాఖ అధ్యయనం చేసినట్లు సమాచారం. ఇక ఇటీవ‌ల ఎన్నిక‌ల సంధ‌ర్బంగా త్వ‌ర‌లో తెలంగాణ‌లో ఉద్యోగాల భ‌ర్తీ ఉంటుంద‌ని ప‌లువురు మంత్రులు చెప్పిన సంగ‌తి విదిత‌మే.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version