కమల వికాసంతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని, రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్, ఆయన కుమారుడు, కూతురు మాత్రమే సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు దుఃఖంలో మునిగిపోయారని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో పేదరికం 10 శాతానికి తగ్గిపోయిందని నాగర్కర్నూల్ సభలో నడ్డా తెలిపారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, రఘునందర్ రావు, విజయశాంతి, వివేక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారని తెలుస్తోంది. పార్టీ పరంగా నాయకుల్లో ఏర్పడిన గందరగోళాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంపర్క్ సే సమర్థన్ లో భాగంగా ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్ జయంత్ ల ఇళ్లకు వెళ్లి… జేపీ నడ్డా వారిని సత్కరించనున్నారు.