జూబ్లీహిల్స్ బాలిక రేప్ లో కేసులో ట్విస్ట్..వారందరిపై పోక్సో చట్టం కేసులు

-

జూబ్లీహిల్స్ రేప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిన్న పోలీస్ కష్టడీకి అనుమతించిన కోర్టు.. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఏ-1గా ఉన్న సాదుద్దీన్‌ను విచారించునున్నారు పోలీసులు. ఈ రోజు ఉదయం 10 గంటలకు చంచల్ గూడా జైలు నుంచి సదుద్దీన్ ను కష్టడికి తీసుకోనున్న పోలీసులు… మొదటి రోజు నిందితుని ప్రొఫైల్, మైనర్స్ తో ఒకరికొకరు ఎలా పరిచయం అయ్యారు.. అనే దానిపై నిందితుని ప్రశ్నించునున్నారు.

అసలు పబ్ లో ఆరోజు ఎం జరిగింది.. మైనర్ బాలికను ఎలా ట్రాప్ చేశారు. పబ్ కు ఎందుకు వెళ్లారు.. బెంజ్ కారు ఎవరు ఇచ్చారు అనే దానిపై విచారణ చేయనున్నారు పోలీసులు. నేరం జరిగిన ప్రదేశంలో సీన్ రికన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు.. సాదుద్దీన్‌ను ప్రశ్నిస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా.. వీరిలో సాదుద్దీన్ ఒక్కడే మేజర్. మిగిలిన ఐదుగురు కూడా మైనర్లే.

వీరిలో సాదుద్దీన్‌తో పాటు నలుగురు మైనర్లపై సామూహిక అత్యాచారం (376 డీ), పోక్సో చట్టం, కిడ్నాప్, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరో మైనర్‌పై  పోక్సో, లైంగిక వేధింపుల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లు.. ప్రస్తుతం జువైనల్‌ హోమ్‌లో ఉన్నారు. వీరిని ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని జువైనల్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version