ఈ రాశి వాళ్ళు ఈరోజు వ్యాపారాలలో,ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు..

-

మేషం: ఆలోచనలు ఎంతకీ కొలిక్కిరావు. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.ముఖ్య నిర్ణయాలు వాయిదా పడతాయి.

వృషభం: సన్నిహితుల నుండి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మిథునం:  ప్రయాణాలు వాయిదా పడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు ఉద్యోగాలలో కొంత ఒత్తిడులు.మిత్రులు, శ్రేయోభిలాషులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. సమావేశాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

సింహం: రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. దైవచింతన. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిపెట్టవచ్చు. చేపట్టిన కీలక వ్యవహారాలలో జాప్యం.

కన్య: ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.రుణ విముక్తి..కొత్త రుణాలు చేస్తారు.

తుల: స్థిరాస్తివృద్ధి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.సమాజంలో ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి..

వృశ్చికం: మిత్రులే శత్రువుల్లా మారతారు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారవచ్చు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

ధనుస్సు: ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.చేపట్టిన పనులు ముందుకు సాగవు. సోదరులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

మకరం: పాతమిత్రుల కలయిక. నూతన వ్యవహారాలు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

కుంభం: ఎంతోకాలంగా వేచిచూస్తున్న ఉద్యోగాలు దక్కవచ్చు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.సమస్యలు తీరతాయి..

మీనం: మిత్రుల నుంచి సమస్యలు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాలను వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరతాయి…

Read more RELATED
Recommended to you

Latest news