గురువారం ఏ రాశి వారికి అన్నింటా విజయాలు కలుగుతాయంటే?

-

జూన్ 2 గురువారం ఏ రాశి వారికి అన్నింటా విజయాలు కలుగుతాయో ఇప్పుడు చుద్దాము..

మేషం:

ఈరోజు చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వస్తులాభాలు. విద్యావకాశాలు..ఈరోజు వ్యాపారులు లాభాలపై సంతృప్తి చెందుతారు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది.సమాజంలో గౌరవం పెరుగుతుంది.

వృషభం:

స్నేహితులతో చికాకులు, గొడవలు కలుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు అధికం. శారీరక రుగ్మతలు. కార్యక్రమాలలో అవాంతరాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు మార్పులుసంభవం..ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి..

మిథునం: 

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందులువినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. కార్యజయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు అధికలాభాలు. ఉద్యోగులకు శుభవార్తలు వింటారు.

కర్కాటకం: 

కుటుంబంలో వివాదాలు, మనస్పర్ధలు. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు. శారీరక రుగ్మతలు. దేవాలయాలు సందర్శిస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

సింహం: 

చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.ఈరోజు అనుకున్న పనులు నేరవేరుతాయి.

కన్య: 

కొత్త ఉద్యొగాల కోసం చూసేవారికి ఈరోజు మంచి రోజు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విందువినోద కార్యక్రమాలతో బిజిగా ఉంటారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగస్తుల సేవలు గుర్తింపు పొందుతారు.

తుల: 

ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులతో లేనిపోని తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమాధిక్యం.. జాగ్రత్త వహించాలి..

వృశ్చికం: 

కుటుంబసమస్యలు బాధించవచ్చు.. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో తగాదాలు, అనారోగ్యం భాదలు.. వ్యాపారులకు అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

ధనుస్సు:

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతులు.. కొత్త పనులు సజావుగా సాగుతాయి..

మకరం:

ఈరోజు ఆదాయం సంతప్తినిస్తుంది. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వాహన వియోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం: 

కొత్తగా అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులు,స్నేహితులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది..మాటలు పడాలి..కొత్త పనులు చేయక పోవడం మంచిది.

మీనం: 

ఆదాయంకు మించిన ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఒక సమాచారం గందరగోళపరుస్తుంది. దూరప్రయాణాలు. స్నేహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులకు బదిలీలు. ఉద్యోగులకు అదనపు పనిభారం..సమాజంలో గుర్తింపు రాదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version