సీఎం జగన్‌ కీలక నిర్ణయం..బాలికల కోసం ప్రతి మండలానికో జూనియర్‌ కాలేజీ

-

సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలికల కోసం ప్రతి మండలానికో జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 23,975 వేల స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ కింద పనులు జరిగాయని.. నెల రోజుల్లోగా నూటికి నూరు శాతం రెండో దశ కింద చేపట్టనున్న అన్ని స్కూళ్లలో పనులు ప్రారంభం కావాలని పేర్కొన్నారు.

cm jagan

టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్, గోరుమద్ద కార్యక్రమాల పై మరింత ధ్యాస పెట్టాలన్న సీఎం.. సమర్ధవంతంగా, నాణ్యతతో అమలు చేయాలి, అప్పుడే ఆశించిన లక్ష్యాలను చేరుకుంటామని వెల్లడించారు. టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్, గోరుముద్ద అమలను మరింత మెరుగ్గా ఎలా చేయవచ్చో ఆలోచన చేయండన్న సీఎం… గతంలో రాష్ట్రంలో సుమారు 400 జూనియర్‌ కళాశాలలు మాత్రమే ఉండేవని వెల్లడించారు. ఇవాళ ఏకంగా 1200 జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం.. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్‌ కళాశాల లేదా కేజీబీవీ లేదా హైస్కూల్‌ ప్లస్‌ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version