లోకేష్ ను ఎన్టీఆర్ తో పోల్చడం చాలా పాపం – కేఏ పాల్‌

-

చంద్రబాబు కళ్లు నెత్తికొచ్చాయి…నారా లోకేష్ ను ఎన్టీఆర్ తో పోల్చడం పాపం అంటూ ఫైర్‌ అయ్యారు. నారా లోకేష్ వాళ్ళ నాన్నే కదా ఎన్టీఆర్ ను చంపిందని.. టిడిపికి రియల్ వారసులైన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లకు టిడిపిని అప్పగించాలని కోరారు కేఏ పాల్‌. మోడీతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన దాని ప్రభావం లేదని తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరుతున్న నాకు సమయం ఇవ్వండి కలిసి మాట్లాడుదామన్నారు.

ka paul comments on nara lokesh

మునుగోడులో నాకు ఓట్లు పడ్డాయి కానీ డబ్బాలు మార్చారని ఆరోపణలు చేశారు కేఏ పాల్‌. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో పెట్టబడులు పెట్టేందుకు కోట్ల రూపాయలు తీసుకువస్తానని..పార్టీలోకి వచ్చి నేను చెప్పినట్టు వింటే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు లేదంటే నా పేరు మార్చుకుంటానని వెల్లడించారు. నేను ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. లోకేష్ కు ఏమైనా అనుభవం ఉందా అని నిలదీశారు. మాటలు రాని లోకేష్ చేతలు ఎలా చేయగలడు పనులు ఎలా చేయగలడు…జనాలు డబ్బులు ఇవ్వగానే పశువుల్లా చంద్రబాబు లోకేష్ సభకు వెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version