గత రెండు రోజులుగా తెలంగాణ అధికార పార్టీ BRS నేతలు రాజయ్య మరియు శ్రీహరి ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రెండు రోజుల నుండి రాజయ్య కడియం శ్రీహరిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా… స్పందించని శ్రీహరి.. తాజాగా కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాజయ్యపై తనపై చేసిన అనవసర విమర్శలపైన స్ట్రాంగ్ గా బదులిచ్చారు. రాజయ్య తన స్థాయిని పూర్తిగా మరిచిపోయి ఇష్టారీతిన మాట్లాడుతున్నాడన్నారు. నా కులం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటూ… మా నాన్న SC మరియు మా అమ్మ BC అయితే సమస్య ఏమిటి అంటూ రాజయ్యను నిలదీశారు. అందరి తల్లులను అవమానపరిచేలా రాజయ్య వ్యాఖ్యలు ఉండడం నిజంగా బాధాకరం అన్నారు. రాజయ్యను ఎమ్మెల్యే గా గెలిపించడానికి రెండు సార్లు తనకోసం తిరిగానని, అయినా ఈ విధంగా మాట్లాడడం చాలా బాధకు గురిచేసిందంటూ గుర్తు చేసుకుని బాధపడ్డారు కడియం శ్రీహరి.
రాజయ్య గురించి సీఎం కు చెప్పానని.. పార్టీ నే ఆయనకు సమాధానం చెబుతుందని శ్రీహరి చెప్పారు.