Kajal Agarwal: మాతృత్వపు అనుభూతులు పదిలం..మెటర్నిటి ఫొటోషూట్‌లో మురిసిపోయిన కాజల్ అగర్వాల్

-

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. పలు చిత్రాల్లో కథానాయికగా నటించి తన అందం, అభినయం ద్వారా తెలుగు ప్రేక్షకుల లోగిళ్లలో తన స్థానం సుస్థిరం చేసుకుంది. ఈ పంచదార బొమ్మ త్వరలో నూతన ప్రయాణం ప్రారంభించనుంది. అమ్మగా ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నది. ఈ క్రమంలోనే భగవంతుడు ప్రసాదించిన అరుదైన వరం అమ్మతనం అనుభూతులను పదిలం చేసుకుంటున్నది.

మెటర్నిటి ఫొటో షూట్ లో పాల్గొన్న అందాల చందమామ కాజల్ అగర్వాల్..ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. అవి నెట్టింట వైరలవుతున్నాయి. మాతృత్వపు అనుభూతులను గుర్తుపెట్టుకోవల్సిన అవసరం నేపథ్యంలో ఇటీవల మెటర్నిటి ఫొటో షూట్స్ వచ్చాయి. అలా ఓ ట్రెండు లాగా ఇవి సాగిపోతున్నాయి.

అమ్మతనాన్ని ఆస్వాదించడం ఓ గొప్ప వరం. కాగా, మాతృత్వపు అనుభూతులను చక్కగా ఆస్వాదిస్తోంది కాజల్ అగర్వాల్. ఎంతో అందంగా అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నానని, కొంచెం అయోమయంగా ఉందని, ఓ క్షణం అందంగా, మరో క్షణం అయోమయంగా, అలా మనసులో గజిబిజీలోనే ఎన్నో భావోద్వేగాలు పుట్టుకొస్తున్నాయని, అవన్నీ కలిపితేనే అసలు కథ అవుతుందని పేర్కొంటూ తన మెటర్నిటీ ఫొటోషూట్ ఫొటోలు, వీడియో షేర్ చేసింది గౌతమ్ కిచ్లూ వైఫ్.

ఇక కాజల్ పోస్టుకు నెటిజన్లతో పాటు సెలబ్రిటీల నుంచి చక్కటి స్పందన వస్తోంది. ‘బ్యూటిఫుల్’ అని హీరోయిన్ రష్మిక మందన కామెంట్ చేయగా, బ్యూటి యూ అని నీరజ కోనా, ఎక్సలెంట్, యూ ఆర్ బ్యూటిఫుల్ మదర్ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ నటించిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ‘ఖైదీ నెంబర్ 150’ ఫిల్మ్ తర్వాత మరోసారి చిరుతో జత కట్టింది పంచదార బొమ్మ. మొత్తంగా మెగా ఫ్యామిలీ హీరోలందరితో ఈమె ఆన్ స్క్రీన్ షేర్ చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version